ఎప్పుడు ఏ విమానం ఆగిపోతుందో, ఓ విమానాశ్రయం లాక్ అవుతుందో తెలియన ఇబ్బందులు పడుతున్నారు మన ముద్దుగుమ్మలు.
రీసెంట్ గా హీరోయిన్ పూజాహెగ్డేకు ఇదే అనుభవం ఎదురైంది. రోజంతా షూటింగ్ చేసిన పూజా హెగ్డే, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. కానీ విమానం లేటైంది. దీంతో ఆమె దిగాలుగా ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఆమె ఫొటో కూడా షేర్ చేసింది.
మెహ్రీన్ మాత్రం అలా చేయలేదు. విమానం లేట్ అవుతుందని గ్రహించిన వెంటనే ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఓ రెస్టారెంట్ లో వాలిపోయింది. అంతా కలిసి చక్కగా భోజనం చేశారు. దానికి సంబంధించిన చిన్న క్లిప్ ను కూడా మెహ్రీన్ షేర్ చేసింది. ఫ్లయిట్ లేట్ అయినా క్వాలిటీ టైమ్ దొరికిందంటూ సంతోషపడింది.
ఈమధ్య శృతిహాసన్ కూడా ఇలానే విమానాశ్రయంలో ఇరుక్కోవాల్సి వచ్చింది. ముంబయి, చెన్నై మధ్య రెగ్యులర్ గా చక్కర్లు కొట్టే ఈ బ్యూటీ, ఈమధ్య ఓ ఫొటోషూట్ పూర్తి చేసుకొని ముంబయి నుంచి చెన్నైకి బయల్దేరింది. కానీ ముంబయి ఎయిర్ పోర్ట్ లోనే దాదాపు 2 గంటలు ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తన షెడ్యూల్స్ అన్నీ లేట్ అయ్యాయని ఆమె బాధపడింది.