నాని హీరోగా నటించిన “దసరా” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఏడాది గ్యాప్ తీసుకొని ఆ దర్శకుడు నాని హీరోగానే “ప్యారడైజ్” అనే సినిమా ప్రకటించాడు. ఐతే, ఇప్పుడు ఈ సినిమా పక్కకు తప్పుకొంది. శ్రీకాంత్ ఓదెల వద్ద ఉన్న మరో కథ మెగాస్టార్ చిరంజీవికి నచ్చడంతో ఇప్పుడు ఆ సినిమా మొదలు కానుంది.
చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ని నాని సెట్ చేశారు. ఈ సినిమాకి ప్రెజెంటర్ గా కూడా నాని వ్యవహరిస్తారు. చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” సినిమాతో బిజీగా ఉన్నారు. మరో నెల రోజుల్లో చిరంజీవి ఈ సినిమాకి సంబంధించిన పనుల నుంచి బయటపడుతారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా మొదలు పెట్టాలనేది మెగాస్టార్ ప్లాన్.
అందుకే, నాని తన “ప్యారడైజ్”సినిమాని తాత్కాలికంగా ఆపినట్లు సమాచారం. “ప్యారడైజ్” కన్నా ముందు మెగాస్టార్ తో సినిమా మొదలుపెడతాడు శ్రీకాంత్ ఓదెల. అందుకే మెగాస్టార్ చిరంజీవి కోసం తన సినిమాని పక్కన పెట్టి నాని మరో సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు.
నాని ప్రస్తుతం “హిట్ 3” సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఇది 2025 మే నెలలో విడుదల కానుంది.