![Anushka](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/12/anushka-ghaati-releasedate.jpg)
“పుష్ప 2” సినిమాలో హీరో ఒక స్మగ్లర్. ఎర్ర చందనం దొంగలించి విదేశాలకు పంపే ఒక కరడుగట్టిన దొంగ. కానీ ఆ దొంగకి సొంత ఇంట్లో ఒక సమస్య ఉంటుంది. తనకు ఇంటి పేరు నిరాకరిస్తుంది తన తండ్రి మొదటి భార్యకి చెందిన సంతానం. దాని కోసం పుష్ప డాన్ గా ఎదుగుతాడు. దాన్ని హీరోయిక్ గా చూపించడంతో జనం కనెక్ట్ అయ్యారు. హీరో సినిమా మొదటి భాగంలోనైనా, రెండో భాగంలోనైనా స్మగ్లర్ మాత్రమే.
ఇప్పుడు అనుష్క కూడా అలాంటి పాత్రే పోషిస్తోంది. “ఘాటి” అనే సినిమాలో ఆమె గంజాయి ఎగుమతి చేసే మహిళగా నటిస్తోంది. ఈ ఆడ డాన్ కి కూడా ఒక కథ ఉంటుంది. గంజాయి డాన్ కావడానికి కారణం ఉంటుంది. సో, ఆమె కూడా ‘హీరో’నే.
దర్శకుడు క్రిష్ ఆమె కథని కూడా ఒక “క్రిమినల్” కథగా కాకుండా “హీరోయిక్”గానే చూపిస్తున్నారు.
మరి, అనుష్క నటించిన ఈ గంజాయి దొంగ కథ ఎర్ర చందనం దొంగ కథలా పెద్ద విజయం సాధిస్తుందా అనేది చూడాలి. ఏప్రిల్ లో విడుదల కానుంది ఈ సినిమా.