శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో బిట్ సాంగ్స్ తో కలిపి మొత్తం 16 పాటలున్నాయట. దీనిపై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య స్పందించాడు. పాటలు సినిమాకు అడ్డం కాదని అంటున్నాడు.
“ఇందులో సాంగ్స్ సినిమా ఫ్లో కి యాడ్ అవుతాయే గానీ ఆపవు. ఇందులో ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తుంది. నాకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా చాలా ఇష్టం. అందులో ఆర్ఆర్ ఎక్కువగా ఉంటుది. ఎమోషన్ చక్కగా యాడ్ చేస్తుంది. మనమే కథ అనుకున్నప్పుడే విజువల్ గా ఒక కలర్ టోన్ ఫిక్స్ అయిపోయాను. ఫెయిరీ టైల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే మ్యూజిక్ చాలా కీలకం. ఈ సినిమాకు హేషమ్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.”
సినిమాలో శర్వానంద్, కృతి శెట్టి భార్యాభర్తలుగా నటించారనే విషయంపై స్పష్టత ఇవ్వడానికి నిరాకరించాడు దర్శకుడు. ప్రస్తుతానికి అది సర్ ప్రైజ్ అని, సినిమా చూసి తెలుసుకోవాలని అన్నాడు. మూవీ మొదలైన 10 నిమిషాలకే ఆ విషయంపై క్లారిటీ వస్తుందని కూడా చెప్పాడు.
ఫెయిరీ టైల్ లాంటి కథ అనుకోగానే లండన్ లో తీయాలని ఫిక్స్ అయ్యాడట. అక్కడ అలంటి ఆర్కిటెక్చర్ వుంటుంది. అందుకే లండన్ వెళ్లాం అని చెప్తున్నాడు దర్శకుడు శ్రీరామ్. ఐతే లండన్ లో సినిమా తీయడం ఖరీదైన వ్యవహారం. అలాగే కష్టం కూడా.
“లండన్ క్లైమెట్ కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుటుంది. ఒక లొకేషన్ అనుకుని షూట్ స్టార్ట్ చేశాక సడన్ గా వర్షం పడుతుంది. క్లైమెట్, అక్కడ లాజిస్టిక్స్ విషయంలో కొన్ని ఛాలెంజస్ ఎదుర్కొన్నాం.”