సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం హైలెట్ గా నిలిచింది. మొత్తం కార్యక్రమంలో పవన్ కల్యాణ్ కు ఎక్కడలేని ప్రాధాన్యం దక్కింది. వేదికపై చిరంజీవి-మోదీ-పవన్ త్రయం అందర్నీ ఆకర్షించింది.
ఇక వేదిక కింద రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ తో పాటు చాలామంది మెగా సభ్యులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఇలాంటి అరుదైన సందర్భాన్ని మెగా కోడలు మిస్సయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది ప్రస్తావించారు.
ఇలాంటి విషయాల్లో అలర్ట్ గా ఉండే లావణ్య త్రిపాఠి వెంటనే క్లారిటీ ఇచ్చింది. లావణ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆమె కాలికి దెబ్బ తగిలింది. ఆమె ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటోంది. అందుకే ఆమె ఈ స్పెషల్ వేడుకకు రాలేకపోయింది.
తను రాలేకపోయానని, మంచి వేడుక మిస్సయ్యానంటూ దెబ్బ తగిలిన కాలు ఫొటోను పోస్ట్ చేసింది లావణ్య. చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు ఆమె బాగానే ఉంది. ఆ తర్వాతే కాలికి దెబ్బ తగిలినట్టుంది.