హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ. హిట్టిచ్చిన హీరోయిన్ కొన్నాళ్ల పాటు ఉంటుంది, ఫ్లాప్ హీరోయిన్లు ఐదారేళ్లకే దుకాణం సర్దేస్తారు. కానీ వరుస ఫ్లాపులిచ్చిన ఈ హీరోయిన్ మాత్రం 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఆమె పేరు కృతి కర్బందా.
“బోణి” సినిమాతో హీరోయిన్ గా మారింది కృతి కర్బందా. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత కూడా ఆమెకు లక్ కలిసిరాలేదు. వరుస ఫ్లాపులిచ్చింది. చివరికి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ తో “తీన్ మార్”సి చేసినా కూడా ఆమెకు సక్సెస్ దక్కలేదు.
ఇక లాభం లేదని భావించిన ఈ హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ కు కూడా షిప్ట్ అయింది. రామ్ చరణ్ అక్కగా కూడా నటించింది. అయినప్పటికీ తెలుగులో ఆమెకు క్రేజ్ రాలేదు. అటు బాలీవుడ్ లో మాత్రం “హౌజ్ ఫుల్ 4” లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ 15 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది కృతి కర్బందా. తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతూ పెద్ద పోస్ట్ పెట్టింది. ఈ హీరోయిన్ తాజాగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.