హీరో సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ జూన్ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
డైరెక్టర్ జ్ఞానసాగర్ కి అవకాశం ఎలా ఇచ్చారు?
ఆయన “సెహరి” అనే రొమాంటిక్ మూవీ తీశారు కానీ నేను చూడలేదు. కానీ ఆయన నన్ను కలిసి “హరోం హర” కథ చెప్పిన తీరు నన్ను కట్టి పడేసింది. నాకు కథ నచ్చితే ఎక్కువ ఆలోచించను.
సినిమా కథ, నేపథ్యం ఏంటి?
“హరోం హర” కమర్షియల్ సినిమానే కానీ ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. కుప్పం నేపథ్యంగా కథ జరుగుతుంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో తెలుగులో ఏ సినిమా రాలేదు అని చెప్పగలను. కుప్పం బ్యాక్ డ్రాప్ లో జేమ్స్ బాండ్ మూవీ అనుకోవచ్చు. ఇందులో హీరో గన్స్ తయారు చేస్తుంటాడు. నా క్యారెక్టర్ కి డైలాగ్ మ్యానరిజం ఉంది. ‘ఇంక సెప్పెదేమ్ లేదు.. సేసేదే’ అనే డైలాగ్ సినిమాలో చాలా చోట్ల వస్తుంది.
సినిమా చూసిన తర్వాత తెలుగులో వచ్చిన టాప్ టెన్ యాక్షన్ సినిమాల్లో ఇదొకటి అని అందరూ అంటారు. ఆ నమ్మకం ఉంది.
కథకి… టైటిల్ కి లింక్ ఏంటి?
కథ జరిగే ఊర్లోని ప్రజలంతా సుబ్రమణ్య స్వామి భక్తులు. అలాగే ఇందులో ఓ నెమలి ఎలిమెంట్ కూడా వుంటుంది. అందుకే, ఆ టైటిల్.
సీక్వెల్ ఉందా ?
కథకి ఆ స్కోప్ వుంది. కానీ ఫలితం, ప్రేక్షకుల స్పందన తర్వాత ఆలోచిస్తాం.
సుబ్రమణ్యం క్యారెక్టర్ కి బ్యాక్ బోన్. పుల్ లెంత్ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన రోల్స్ లో ఇది స్ట్రాంగ్ రోల్.