జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే పరిచయం అయింది. ఐతే, ఖుషి కపూర్ ఇంకా తెలుగులో కానీ, తమిళంలో కానీ నటించలేదు. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్ళ ఫోకస్ వేరుగా ఉంది.
జాన్వీ కపూర్ మొదట బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇప్పుడు తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి నిలిపింది. ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించిన ఈ భామ తాజాగా రామ్ చరణ్ కొత్త సినిమా చేస్తోంది. అలాగే, ‘దేవర 2’ (ఒకవేళ ఉంటే) కూడా ఉంది. ఈ 2025లో మరో రెండు దక్షిణాది చిత్రాలు (ఒకటి తమిళం, ఒకటి తెలుగు) ఆమె ఖాతాలో చేరుతాయని ఆమె పీఆర్ టీం చెప్తోంది.
ఇక ఖుషి కపూర్ తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైదు ఖాన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రాన్ని సైన్ చేసింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం “లవ్ టుడే”కి రీమేక్. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అయ్యే సినిమాలతో బాలీవుడ్లో బిజీ అవుతోంది ఖుషి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత తెలుగులో నటించింది. సో, ఖుషి కూడా మరికొన్నాళ్లు బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకొని సౌత్ లోకి అడుగుపెడుతుంది కాబోలు.