ప్రతి ఒక్కరికీ ఓ సెంటిమెంట్ ఉంది. అలాంటి సెంటిమెంట్స్ తనకు లేవని గతంలో ఎన్నోసార్లు ప్రకటించాడు దర్శకుడు కొరటాల. సెంటిమెంట్లు, ఛాదస్తాలు, భేషజాలకు దూరంగా ఉండే ఈ దర్శకుడు కూడా తనకు తెలియకుండానే ఓ సెంటిమెంట్ ను బయటపెట్టాడు.
“నా మొదటి సినిమా మిర్చి నుంచి దేవర వరకు అన్నీ దిల్ రాజు గారే రిలీజ్ చేశారు. నా లక్కీ మస్కట్ ఆయన. చివరికి ఎలా తయారైందంటే.. ఆయన ఆఫీస్ లో నా సినిమా ఉంటేనే నాకు సక్సెస్ అన్నట్టు మారింది పరిస్థితి.”
ఇలా తన కెరీర్ కు, దిల్ రాజుకు ఉన్న లింక్ ను బయటపెట్టాడు కొరటాల. దేవర సినిమాను సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పిన కొరటాల.. ఎన్టీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూనే.. నిర్మాతగా కల్యాణ్ రామ్, హీరోయిన్ గా జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్, అనిరుధ్, శ్రీకాంత్.. వీళ్లంతా లేకపోతే దేవర ఈ రేంజ్ కు వెళ్లేది కాదన్నాడు.
అంతా తమ సొంత సినిమాగా భావించి చివరి నిమిషం వరకు పనిచేశారన్నారు కొరటాల. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది.