హీరోహీరోయిన్లు చాలామందికి సీక్రెట్ ఎకౌంట్స్ ఉంటాయి. ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లో తమ గురించి, తమ సినిమాల గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి లాంటివి తన సీక్రెట్ ఎకౌంట్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ సీక్రెట్ ఎకౌంట్స్ తో వీళ్లు ఇది మాత్రమే చేయరు. కొన్ని చిలిపి పనులు కూడా చేస్తుంటారు.
ఈ విషయాన్ని నటి ఊర్వశి రౌతేలా బయటపెట్టింది. తనకు ఓ సీక్రెట్ ఎకౌంట్ ఉందని తెలిపిన ఊర్వశి, ఆ ఎకౌంట్ ద్వారా డేటింగ్ యాప్స్ లో కొంతమందితో ఛాటింగ్ చేస్తానని, మరికొందరితో మాట్లాడానని కూడా వెల్లడించింది.
అయితే తను మాత్రమే కాదని.. హృతిక్ రోషన్, అర్జున్ కపూర్, నేహా శర్మ, అనన్య పాండే, జాన్వి కపూర్, వాణీ కపూర్, సోనాల్ చౌహాన్ లాంటి చాలామందికి ఇలాంటి సీక్రెట్ ఎకౌంట్స్ ఉన్నాయని.. వాళ్లంతా డేటింగ్ యాప్స్ లో ఉన్నారని ప్రకటించింది ఊర్వశి. వీళ్లలో కొంతమంది సీక్రెట్ ఎకౌంట్స్, వాళ్ల ఫోన్ నంబర్లు కూడా తనకు తెలుసని ఊర్వశి వెల్లడించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలయ్యతో తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని, బయట చెప్పుకుంటున్నట్టు బాలయ్య మరీ అంత కోపిష్టి కాదని, అతడు స్వీట్ పర్సన్ అని అంటోంది ఊర్వశి.