ఓవైపు విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు సాంగ్ పరుగెడుతూనే ఉంది. ‘కిస్సిక్’ సాంగ్ మేటర్ ఇది. ‘పుష్ప-2’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘కిస్సిక్’ సాంగ్ యూట్యూబ్ ను హోరెత్తిస్తోంది. తాజాగా 50 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది.
నిజానికి ఈ లిరికల్ వీడియోకు యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. పార్ట్-1లో ‘ఊ అంటావా..’ సాంగ్ తో కంపేర్ చేసిన చాలామంది ‘కిస్సిక్’ సాంగ్ పై పెదవి విరిచారు. ఊపు లేదన్నారు, కిక్ రాలేదన్నారు.
కానీ యూట్యూబ్ లో చూస్తే ఈ పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. నిజంగా ఇది అంత పెద్ద హిట్టయిందా అనే అనుమానం కలిగిలే ఉన్నాయి నంబర్లు.
అల్లు అర్జున్, శ్రీలీల కలిసి డాన్స్ చేసిన ఈ సాంగ్ పై భారీ అంచనాలున్నాయి. అసలు ఈ సాంగ్ లో డాన్స్ చేసే హీరోయిన్ ఎవరంటూ 6 నెలల పాటు చర్చ నడిచింది. శ్రద్ధా కపూర్ లాంటి స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా ఈ ప్రెస్టీజియస్ సాంగ్ లో డాన్స్ చేసే అవకాశం శ్రీలీలను వరించింది.
ప్రస్తుతానికైతే ఈ పాటపై పెదవి విరుపులతో పాటు రికార్డ్ వ్యూస్ కూడా ఉన్నాయి. సినిమా రిలీజైన తర్వాత ఈ సాంగ్ హిట్టయిందా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ‘ఊ అంటావా..’ సాంగ్ విషయంలో కూడా ఇదే జరిగింది.