తనపై గతంలో జరిగిన ట్రోలింగ్ పై మరోసారి స్పందించింది సమంత. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో తనను చాలామంది సెకెండ్ హ్యాండ్ అని, యూజ్ డ్ అంటూ పోస్టులు పెట్టారని గుర్తుచేసుకొని బాధపడింది.
“విడాకుల తర్వాత చాలామంది నన్ను హేళన చేశారు, ఎన్నో కామెంట్స్ వచ్చాయి. సెకెండ్ హ్యాండ్, యూజ్డ్, వేస్ట్ లైఫ్ అన్నారు. చాలా అవమానించారు, ఎన్నో మాటలు పడ్డాను. ఇలాంటివి అమ్మాయిలు, కుటుంబ సభ్యులు ఎదుర్కోవడం ఎంత కష్టమో నాకు అనుభవమైంది.”
అప్పట్లో ఆ మాటలు తనను చాలా బాధించాయని, వాటిని తిప్పికొట్టాలని అనుకున్నానని, తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గట్టిగా చెప్పాలనుకున్నానని, కానీ దాని వల్ల ప్రయోజనం లేదని తెలిసి విరమించుకున్నట్టు తెలిపింది సమంత.
ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని, జీవితంలో తదుపరి దశ కోసం ఎదురుచూస్తున్నానని, మంచి ప్రాజెక్టులు చేస్తున్నానని తెలిపింది సమంత. ఆమె చేసిన ‘సిటాడెల్-హనీ బన్నీ’ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.