
పెళ్లి చేసుకుంటే కాలం కలిసొస్తుందంటారు పెద్దలు. చాలామంది విషయంలో అది నిజమైంది కూడా. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే అంటున్నాడు. ఇతడు నటించిన ‘క’ సినిమా రిలీజైంది. దీపావళి కానుకగా వచ్చిన ఆ సినిమా పెద్ద హిట్టయింది.
పెళ్లి తర్వాత కిరణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇది. ఈ మూవీ హిట్టవ్వడంతో పెళ్లి తనకు కలిసొచ్చిందంటున్నాడు అబ్బవరం.
తాజాగా ‘క’ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కిరణ్ స్పందించాడు. పెళ్లి తర్వాత కలిసొస్తుందని అంటుంటారని, తనకు మాత్రం నిజంగానే కలిసొచ్చిందని అన్నాడు.
రహస్య తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఓ పాజిటివ్ ఫీల్ వచ్చిందని ప్రకటించాడు. తన సినిమా సక్సెస్ క్రెడిట్ ను భార్యకు కూడా ఇచ్చాడు. అటు రహస్య కూడా ఎమోషనల్ అయింది. తన భర్తకు సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది.