ఈమధ్య కాలంలో వినూత్న ప్రచారంతో ఆకట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది ‘పొట్టేల్’ మాత్రమే. అనన్య నాగళ్ల నటించిన ఈ సినిమా ప్రచారంతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఒక దశలో విమానంలో కూడా ప్రచారం చేసి అందర్నీ ఆకర్షించింది యూనిట్.
అలా ఓ మోస్తరు అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మంచి టాక్ వచ్చింది. సందేశం బాగుందంటూ క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత రోజుల్లో సినిమా ఆశించిన స్థాయిలో మెరుగుపడలేకపోయింది.
దీనికితోడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియా పూర్తిగా ఈ సినిమాను పక్కనపెట్టింది. అలా అయ్యంగారు దెబ్బకు కుదేలైన ‘పొట్టేల్’.. దీపావళితో పూర్తిగా చతికిలపడింది.
ALSO CHECK: Ananya Nagalla’s black love
దీపావళికి ఒకేసారి 4 సినిమాలొచ్చాయి. వీటిలో ఒక సినిమాను మినహాయిస్తే, మిగతా 3 సినిమాలు అంచనాలతో వచ్చాయి. ఆ తర్వాత మంచి టాక్ కూడా తెచ్చుకున్నాయి. దీంతో ‘పొట్టేల్’ ఖతం అయింది.