“ఖైదీ” సినిమాతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ పెద్ద దర్శకుడిగా ఎదిగాడు. ఆ సినిమా తెచ్చిన విజయం, పేరు అతని కెరీర్ ని నిలబెట్టింది. ఆ తర్వాత విజయ్ హీరోగా “మాస్టర్”, “లియో” తీశాడు. కమల్ హాసన్ హీరోగా “విక్రమ్” తీసిసంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు రజినీకాంత్ తో “కూలి” అనే సినిమా మొదలైంది.
“కూలి” సినిమా పూర్తి అయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాత “ఖైదీ 2” తీస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేం. అందుకే, హీరో కార్తీ కొత్తగా మూడు సినిమాలు సైన్ చేశాడు.
కార్తీకి “ఖైదీ 2” మీద ఆశ పోయినట్లు ఉంది. తాజాగా “సర్దార్ 2” సినిమా చేస్తున్నాడు కార్తీ. ఆ తర్వాత కొత్తగా మరో రెండు సినిమాలు చేస్తాడట.