మృణాల్ ఠాకూర్ ఇటీవలే “కల్కి 2898 AD” సినిమాలో ఆమె చిన్న పాత్రలో మెరిసింది. ఈ అమ్మడు రొమాన్స్ గురించి తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించింది.
“నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే అనిపిస్తుంది. మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం, మన పట్ల శ్రద్ధ చూపడం, మన కోసం కొన్ని చిన్ని పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు.”
ఇలా తన దృష్టిలో రొమాన్స్ అంటే ఇది అని చెప్పింది ఈ భామ. ఒక మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ లో ఉన్నది అని టాక్.
మృణాల్ ఠాకూర్ కి తెలుగులో చాలా క్రేజు ఉంది. ఐతే, హీరోయిన్ గా మరో తెలుగుసినిమా కోసం ఆమె వెయిట్ చేస్తోంది. మరోవైపు, హిందీలో ఒక మూవీ చేస్తోంది. ఒక బడా బాలీవుడ్ మూవీ కూడా ఒప్పుకొంది. ఆమె తదుపరి తెలుగు చిత్రం ఎదవతుందో చూడాలి.