కమల్ హాసన్ నటించిన “భారతీయుడు 2” జులై 12న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాలో అనేక గెటప్పుల్లో కమల్ హాసన్ కనిపిస్తారు. ఐతే ట్రైలర్ చూస్తే కథ పాత “భారతీయుడు”లా ఉంది తప్ప కొత్తదనం కనిపించలేదు.
ఇదే విషయం అడిగితే కమల్ హాసన్ స్పందించారు. “అదే కథ తీయాలనుకుంటే ఇన్నేళ్లు ఎందుకు ఆగుతాం. సరైన కథ దొరకలేదనే వెయిట్ చేశాం కదా,” అని సమాధానం ఇచ్చారు కమల్ హాసన్.
“సినిమా మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అని గ్యారెంటీగా చెప్పగలను. ట్రైలర్ లో చూసింది వేరు, సినిమాలో చూడబోయే సర్ప్రైజ్ వేరు,” అని కమల్ హాసన్ తెలిపారు.
శంకర్ ఇటీవల తీసిన సినిమాలు ఏవీ భారీ విజయం సాధించలేదు. ఒకప్పటిలా శంకర్ సినిమాల్లో కొత్తదనం ఉండటం లేదు. భారీతనమే ఉంటుంది. “భారతీయుడు 2” ట్రైలర్ చూస్తే భారతీనమే కనిపించింది. ఈ కామెంట్స్ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు.