రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్” సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకొంది. కానీ హీరోయిన్ పేరు మాత్రం చెప్పలేదు. తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే పలు సార్లు ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తోంది అని పేర్కొంది. కానీ ఎందుకనో పూరి, నిర్మాత ఛార్మి ఆమె పేరు దాచి పెట్టారు.
ఐతే ఈ రోజు టీజర్ లో ఆమెని చూపించక తప్పలేదు. ఇన్నాళ్లకు కావ్య థాపర్ తమ సినిమా హీరోయిన్ అన్న విషయాన్ని బయట పెట్టారు. రామ్ సరసన ఈ సినిమాలో కావ్య థాపర్ నటించింది.
కావ్య థాపర్ “ఏక్ మినీ కథ” అనే సినిమాతో పేరు తెచ్చుకొంది. ఆ తర్వాత రవితేజ సరసన “ఈగిల్”, సందీప్ కిషన్ సరసన “ఊరు పేరు భైరవకోన”, “బిచ్చగాడు 2” వంటి సినిమాలు చేసింది. ఆమె అందాలు ఆరబోయడంలో, బోల్డ్ గా నటించడంలో పూరి అభిరుచికి దగ్గరగా ఉంటుంది. సో, పూరి సినిమాకి సరైన హీరోయిన్ ఈ భామ.
ఐతే, కావ్య థాపర్ పేరుని ఇన్నాళ్లూ ఎందుకు సస్పెన్స్ లో ఉంచారు అనేది పూరికి, ఛార్మికే తెలియాలి.
ALSO CHECK: ‘Double iSmart’ teaser: Mass and devotional elements are combined
“ఊరు పేరు భైరవకోన” ఆడింది కానీ ఆ సినిమా వల్ల కావ్యకి ఉపయోగపడింది ఏమి లేదు. మరి కావ్యకి పూరి సినిమాతో క్రేజ్ వస్తుందా?