గాయని సుచిత్ర ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ గురించి చేసిన కామెంట్స్ ని తమిళనాడుకి చెందిన ఒక టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. దాంతో, ఈ వివాదం ఇప్పుడు తమిళనాడుని ఊపేస్తోంది. సుచిత్ర చేసిన వ్యాఖ్యలకు ఎలా స్పందించాలో తెలియక ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, త్రిష సతమతం అవుతున్నారు.
సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
ధనుష్ అభిమానులు ఇప్పుడు ఇతర హీరోలను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. అలాగే సుచిత్ర గతంలో రకరకాలుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పులను బయటికి తీశారు. తమ హీరోని కావాలని బద్నామ్ చేస్తున్నారు అని ధనుష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. దాంతో ఇతర హీరోల లవ్ అఫైర్ల వివరాలను తవ్వి తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
సుచిత్ర ధనుష్ ని కొన్ని చోట్ల పొగిడింది, కొన్ని చోట్ల ఘోరంగా మాట్లాడింది. మాజీ భార్య ఐశ్వర్యతో పోల్చితే ధనుష్ మంచివాడు అని చెప్పింది సుచిత్ర. ఐతే, దనుష్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడు అని, అలాగే అటు ఆడవాళ్ళతో, ఇటు గేలతో ధనుష్ కి అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా మాట్లాడింది. అందుకే, ధనుష్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ: మళ్లీ సుచి లొల్లిలో త్రిష!
ధనుష్ ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న తెలుగు చిత్రం “కుబేర”లో నటిస్తున్నాడు.