కంగన రనౌత్ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమెకి ఇవే మొదటి ఎన్నికలు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ భామకి హిమాచల్ ప్రదేశ్ లోని మండి సీటు నుంచి బరిలోకి దింపారు. ఇంతకుముందు టీవీ ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియాలో బీజేపేతర పార్టీ నాయకులను తెగ విమర్శించేంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఆమె కూడా రకరకాల గిమ్మిక్కులు చేస్తోంది.
హిమాచల ప్రదేశ్ స్థానికుల వస్త్రధారణతో ఆమె ఎన్నికల ప్రచారం చేస్తోంది. గెలవడానికి ఆమె శ్రమిస్తోంది.
కంగన రనౌత్ కి ఈ గెలుపు ఇజ్జత్ కా సవాల్. ఇన్నాళ్లూ ఆమె బాలీవుడ్ లో పెద్ద హీరోలను కూడా తిట్టిపోసింది. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సైతం ఆమె “పప్పూ” అంటూ విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు బీజేపీకి ఇతర పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ టైంలో గెలుపు అంత సులువు కాదు. అందుకే, కంగన ప్రచారం కోసం తెగ కష్టపడుతోంది.
వచ్చే రెండు వారాలు ఆమె శ్రమించాలి. జూన్ 1న హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.