ప్రతి హీరోయిన్ కి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న… ఎలాంటి భర్త కావాలి అనుకుంటున్నారు? ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ కి కూడా ఈ ప్రశ్న మీడియా నుంచి వచ్చింది. ఆమె తాజాగా “మిస్టర్ అండ్ మిస్సెస్ మహి” అనే చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటోంది. సినిమాలో మిస్సెస్ మహిగా నటించిన జాన్వీ తన నిజజీవితంలో తన మిస్టర్ లో ఏ క్వాలిటీస్ కోరుకుంటుంది అనే ఆసక్తి జర్నలిస్టుల్లో కలిగింది.
దానికి ఆమె ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది.
జాన్వీ: “నా కాబోయేవాడు నా కలలను తన కలలుగా మలుచుకోవాలి. నాకు సపోర్ట్ ఇవ్వాలి. నా కోసం బలంగా నిలబడాలి. నాకు ఆనందం ఇవ్వాలి. నవ్వించాలి. నేను ఏడ్చినప్పుడు కూడా నాతోనే ఉండాలి.”
వెంటనే జర్నలిస్టులు … అవును అలాంటి వాడు నీకు ఆల్రెడీ దొరికాడు కదా అన్నారు. ఆమె వెంటనే నవ్వుతూ కన్ను కొట్టింది.
ఆమె కొంతకాలంగా తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది. వీరు పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నారు అనేది టాక్. అందుకే జర్నలిస్టులు ఆల్రెడీ ఉన్నాడు కదా అనగానే అలా నవ్వి కన్ను కొట్టింది.