
“కార్తికేయ-2” జాతీయ స్థాయిలో హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాను జాతీయ ఫిలిం అవార్డుల జ్యూరీ కూడా గుర్తించింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా “కార్తికేయ-2″కు అవార్డు ప్రకటించింది. దీంతో యూనిట్ ఉబ్బితబ్బివుతోంది. ఇదే ఊపులో కార్తికేయ-3పై ప్రకటనలు చేశారు హీరో, దర్శకుడు.
కార్తికేయ-2కు అవార్డు రావడం అంతా కృష్ణుడి దయ అన్నాడు దర్శకుడు చందు మొండేటి. సినిమాలో చెప్పిన కృష్ణ తత్వం అందరికీ కనెక్ట్ అయిందని, అదే తమకు అవార్డ్ తెచ్చిపెట్టిందన్నాడు.
కార్తికేయ-3 సినిమాపై కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని ప్రకటించాడు.చందు మొండేటి
ప్రస్తుతం “తండేల్” సినిమా తీస్తున్నాడు చందు మొండేటి. ఈ సినిమా తర్వాత తను చేయబోయే ప్రాజెక్టు కార్తికేయ-3 అని ప్రకటించాడు ఈ దర్శకుడు. అటు హీరో నిఖిల్ కూడా ఇదే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు.
కార్తికేయ-3 సినిమా తన ఎంటైర్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలవబోతోందని వెల్లడించాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్లు నడుస్తున్నాయని, ఎవరూ ఊహించని రేంజ్ లో, భారీ స్థాయిలో కార్తికేయ-3 ఉంటుందని, ఈసారి మరో కొత్త విషయాన్ని, దేశమంతా కనెక్ట్ అయ్యే అంశాన్ని చర్చించబోతున్నామని తెలిపాడు.