భారతీయ సినిమా సంగీత ప్రపంచంలో ఏ ఆర్ రెహమాన్ ఒక లెజెండ్. మొదటి సినిమా “రోజా”తోనే సంచలనం రేపారు రెహమాన్. అలాగే ఆస్కార్ అవార్డు అందుకొన్న మొదటి సంగీత దర్శకుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు మరో రికార్డు ఆయన ఖాతాలో పడింది.
తాజాగా ఆయనని మరోసారి జాతీయ అవార్డు వరించింది. “పొన్నియన్ సెల్వన్”కి ఆయన అందించిన నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ కేటగిరిలో రెహమాన్ కి అవార్డు వచ్చింది.
మొత్తంగా ఇది ఏడో జాతీయ అవార్డు రెహమాన్ కి. మొదటి చిత్రం “రోజా”తోనే జాతీయ అవార్డు దక్కింది. ఆ తర్వాత “మెరుపు కలలు”, “లగాన్”, “అమృత”, “చెలి”, “మామ్”, “పొన్నియన్ సెల్వన్ 1″కి జాతీయ అవార్డులు వచ్చాయి. “మామ్”, “పొన్నియన్ సెల్వన్ 1″చిత్రాలకు నేపథ్య సంగీత దర్శకుడిగా అవార్డులు దక్కాయి.
అత్యధిక సార్లు జాతీయ అవార్డులు అందుకున్న సంగీత దర్శకులు వీరే…
ఏ ఆర్ రహమాన్ – 7
ఇళయరాజా – 5
విశాల్ భరద్వాజ్ – 4
ఇళయరాజాని మించిపోయారు రెహమాన్.
ఆస్కార్ అవార్డులు అందుకున్న భారతీయ సంగీత దర్శకులు
ఏ ఆర్ రెహమాన్ (స్లమ్ డాగ్ మిలియనీర్)
ఎం.ఎం. కీరవాణి (ఆర్ ఆర్ ఆర్)