కార్తీ ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తాడు. అతడి స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. ఈసారి కూడా అదే పని చేశాడు, తన మార్క్ చూపించాడు. కానీ తెలుగు ప్రేక్షకులు అతడిపై సానుభూతి కురిపిస్తున్నారు. దీనికి కారణం దేవర సినిమా.
కార్తి నటించిన తాజా చిత్రం సత్యం సుందరం. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి హార్ట్ టచింగ్ మూవీ రాలేదంటూ చూసిన వాళ్లు చెబుతున్నారు.
కానీ కార్తి సినిమాకు థియేటర్లు దొరకడం లేదు. ఉన్న థియేటర్లలోకి జనాలు రావడం లేదు. అంతా దేవర జపం చేస్తున్నారు. దేవర ప్రభంజనం ముందు సత్యం సుందరం సినిమా వెలవెలబోతోంది. మంచి కంటెంట్ ఉంది, కానీ అటువైపు దేవర ఉండడంతో, మరో ఆలోచన లేకుండా చాలామంది దేవర టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
సినిమా బాగున్నప్పటికీ కార్తికీ ఫలితం దక్కలేదు. రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడం అంటే ఇదే. ఇలా మంచి సినిమాలు ఫెయిలైన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఉదాహరణకు విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ కూడా ఇలాంటిదే. ఇంకేమైనా మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి..