దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది కాంతార సినిమా. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి “కాంతార-ఛాప్టర్ 1” అనే టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ కూడా సూపర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ లాక్ అయింది.
వచ్చే ఏడాది అక్టోబర్ 2న కాంతార ప్రీక్వెల్ థియేటర్లలోకి రాబోతోంది. అక్టోబర్ 2, పబ్లిక్ హాలిడే. ఆరోజు గురువారం పడింది. అంటే, “కాంతార-ఛాప్టర్ 1″కు లాంగ్ వీకెండ్ సెట్ అయిందన్నమాట.
స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఈసారి మరిన్ని వింతలు-విశేషాలు చూపించబోతున్నారు. ఎలాంటి హంగామా లేకుండా, ప్రచారానికి దూరంగా ఈ సినిమా షూటింగ్ ను కొనసాగిస్తున్నాడు రిషబ్.
ప్రీక్వెల్ కు సంబంధించి అతడి ప్లానింగ్ పక్కాగా ఉంది. 6 నెలలు షూటింగ్ కు, మరో 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయించాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫ్రాంచైజీ కింద మార్చాలనేది మేకర్స్ ప్లాన్.