అకిరా ఆల్రెడీ సంగీతంలో కొంత అనుభవం సంపాదించిన సంగతి తెలిసిందే. అతడిప్పటికే కీబోర్డ్ లో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాదు, ఓ షార్ట్ ఫిలింకు సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఇప్పుడీ పవన్ వారసుడు, తండ్రి సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
పవన్ కల్యాణ్ హీరోగా ‘ఓజీ’ సినిమా తెరకెక్కుతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఓజీ కోసం అకిరా సేవల్ని వాడుకుంటున్నట్టు తెలిపాడు.
“ఓజీలో రమణ గోగుల గారితో ఓ పాట పాడించాలని చూస్తున్నాను. అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. ‘ఓజీ’ కోసం అకిరాను పిలిచాను. అకిరా చేతి వేళ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. పర్ఫెక్ట్ పియానో ప్లే చేసే వ్యక్తిలా ఉంటాడు. రెండు నెలలు నాతో అకిరా పని చేశాడు.”
ఇక ‘ఓజీ’లో పవన్ ఓ పాట పాడుతున్నాడనే ప్రచారాన్ని తమన్ ఖండించాడు. పవన్ ను కలవడానికే చాలా కష్టపడుతున్నామని, ఇక ఆయనతో పాట ఎలా పాడిస్తామని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది. సుజీత్ దర్శకుడు.