మంచు విష్ణు కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా “కన్నప్ప.” ఈ సినిమా కోసం తన డబ్బుతో పాటు టైమ్ మొత్తాన్ని కేటాయించాడు. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొచ్చేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలో “”కన్నప్ప సినిమా టీజర్ ను కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో లాంచ్ చేశాడు. ఆ టీజర్ కు అంతర్జాతీయ ప్రముఖులు, మీడియా నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం విడుదల చేయలేదు.
ఇప్పుడీ టీజర్ ను తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాడు విష్ణు. 14వ తేదీన కన్నప్ప టీజర్ ను లాంఛ్ చేయబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఇప్పటికే అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, శరత్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. టీజర్ తో కన్నప్ప సినిమాపై మరింత హైప్ పెరుగుతుందని విష్ణు ఆశపడుతున్నాడు.