కొడుకు ప్రయోజకుడైతే ఏ తల్లికైనా ఆనందమే. రేణు దేశాయ్ ఇప్పుడా ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని అకిరా కలవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, పక్కన నిలబడి ఫొటో దిగడంతో రేణు దేశాయ్ ఆనందానికి అవధుల్లేవ్.
“ఒక తల్లిగా నాకు ఎనలేని సంతోషాన్నిచ్చిన సందర్భం… కల్యాణ్ గారితో వెళ్లిన అకిరా, నరేంద్ర మోడీ గారిని కలిసి వారితో ఫోటో దిగడం. వ్యక్తిగతంగా నాకు బీజేపీ, మోడీ గారంటే చాలా అభిమానం. అలాంటిది ఈరోజు ఈ ఫోటో చూస్తుంటే నా మనసు ఉద్వేగానికి గురైంది. నా కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నా హృదయం నిండిపోయింది. అకిరా ని ఆశీర్వదించిన మోడీ గారికి ధాన్యవాదాలు. అలాగే అకిరా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు.”
ఇలా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది రేణుదేశాయ్. ఈ సందర్భంగా మోదీ-అకిరా కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జనసేన విజయం సాధించింది. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా కొడుకు అకిరా, భార్య అన్నా లెజనెవాతో కలిసి ప్రధాని మోదీని కలిశారు పవన్. ఈ సందర్భాన్ని రేణు దేశాయ్ సెలబ్రేట్ చేసుకున్నారు.