నాగబాబు సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడి చేస్తారు. ఇంతకుముందు చాలామందిపై కామెంట్లు, విమర్శలు చేసేవారు. కానీ ఆయన ఎప్పుడు ఎవరిపై విమర్శ చేసినా రివర్స్ లో పెద్ద ట్రోలింగ్ ఎదుర్కొనేవారు. ఎందుకంటే నాగబాబు ‘స్వయంప్రకాశిత’ సెలెబ్రిటీ కాదు.
ముందుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వల్ల గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయ ప్రాముఖ్యం ఏర్పడింది. అందుకే, ముందు మీ పార్టీని గెలిపించి ఇలాంటి మాటలు మాట్లాడు అని ఇంతకుముందు గేలి చేసేవారు జనం. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు నాగబాబు మీసం తిప్పుతున్నారు గర్వంగా.
మీసం తిప్పుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇది ఆంధ్రుడి తరఫున తిప్పుతున్న మీసం అని అంటున్నారు.
ఇది ఆయన పోస్ట్: “ఈ మీసం తిప్పింది ‘జనసేనాని’ 100% Strike Rate కొట్టాడని కాదు, కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు. ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం…!”
నాగబాబుకి ఏమి పదవి దక్కుతుందో చూడాలి. నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అవుతారు అని సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతోంది.