“కేజీఎఫ్ ఫ్రాంచైజీ”తో ఒకేసారి పాపులర్ అయింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సినీ ఇండస్ట్రీలో ఎదగాలనేది తన అంతిమ లక్ష్యం అని చెప్తోంది.
“సినిమాల్లోకి రావాలనేది నా మొదటి లక్ష్యం. అయితే సినిమా ఫీల్డ్ లోకి రావాలంటే వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా కెరీర్ ప్రారంభించవచ్చు. కానీ మోడలింగ్ లో అలా కాదు, ఒక వయసు దాటిన తర్వాత మోడలింగ్ చేయలేం. అందుకే నేను చాలా రీసెర్చ్ చేశాను. అలా పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత ముందుగా మోడలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. మోడల్ గా చేసి సినిమాల్లోకి వచ్చాను.”
ఇలా సినిమాల్లోకి రాకముందు తన ఆలోచన విధానాన్ని బయటపెట్టింది శ్రీనిధి.
ఒక్కసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత మోడలింగ్ చేయలేకపోయాననే బాధ ఉండకూడదని, అందుకే ముందుగా మోడలింగ్ చేసి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపింది.
“కేజీఎఫ్” లాంటి సక్సెస్ తర్వాత వెంటనే అనేక పెద్ద సినిమాలు చెయ్యాలని ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత సక్సెస్ రాలేదు. ప్రస్తుతం తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన “తెలుసు కదా”మూవీ చేస్తోంది.