ప్రభాస్ అభిమానులను, సినిమా వర్గాలను తెగ టెన్షన్లో పెట్టిన “కల్కి” టీం ఎట్టకేలకు సినిమా విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకొంది. డేట్ ఫిక్స్ చేసింది. ఆ డేట్ ని ప్రకటించేందుకు టైం కూడా సెట్ చేసింది.
శనివారం సాయంత్రం ఐదు గంటలకు “కల్కి 2898 AD” సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారు. జూన్ 27న విడుదల తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక దశలో సినిమాని జులై రెండో వారంలో విడుదల చెయ్యాలనుకున్నారు. నిన్నటివరకు డోలాయమానంలో ఉన్న టీం ఫైనల్ గా జూన్ 27ని ఫిక్స్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి అశ్వినీదత్ నిర్మాత. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు ఉంటుంది అని అంచనా. ఇంత భారీ చిత్రం కాబట్టే విడుదల తేదీపై ఇంత తర్జన భర్జన పడ్డారు.
ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంటుంది. ఐతే మొదటి భాగంలోనే రెండో భాగం గురించి హింట్ ఇస్తారట. “కల్కి”లో కమల్ హాసన్ విలన్ గా నటించారు. కానీ మొదటి భాగంలో ఆయన గెస్ట్ రోల్ లా కొద్ది సేపే కనిపిస్తారని అంటున్నారు. ఆయన అసలైన పాత్ర రెండో భాగంలో ఉంటుందట.