“నేను కూడా నా అండాలు దాచిపెట్టాలని భావిస్తున్నా”
ఇది మృణాల్ ఠాకూర్ కొత్త స్టేట్మెంట్. ఆమె చెప్పిన ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బాలీవుడ్ హీరోయిన్లు చాలా బోల్డ్ గా జీవిస్తారు. మాట్లాడేది కూడా సగటు భారతీయులకు షాకింగ్ కలిగేలా ఉంటుంది. ఆమె తన “ఎగ్స్ ని ఫ్రీజ్” చేసే ఆలోచనలో ఉన్నాను అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరూ ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు.
కెరీర్ కారణంగానో, ఆరోగ్య రీత్యానో వయసులో ఉన్న ఆడవాళ్లు తమ అండాల విడుదల కాలంలో కొన్నింటిని ఫెర్టిలిటీ డాక్టర్ల వద్ద దాచిపెడుతారు. ఈ పద్దతిని cryopreserving అని అంటారు. మాములు భాషలో “ఎగ్స్ ని ఫ్రీజ్” చెయ్యడం లేదా అండాలను దాచిపెట్టడం అనొచ్చు.
మృణాల్ ఠాకూర్ కూడా దాని గురించి ఆలోచిస్తోంది. ఆమెకి ఇప్పుడు 31 ఏళ్ళు. మరో మూడు నెలల్లో 32వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదంట. కెరీర్ పై ఫోకస్ పెడుతుందట.
ఇంకో ఐదారేళ్లు సినిమాలో నటిస్తూ పెళ్లి విషయాన్ని పక్కన పెడితే అప్పుడు పిల్లలను కనాలనుకుంటే అంత సులువు కాదేమో అని ఆమె భయపడుతున్నట్లు ఉంది. అందుకే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే బెటర్ అని భావిస్తోంది.
బాగా సంపాదిస్తోంది ఇప్పుడే
మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ని టీవీ సీరియల్స్ తో మొదలు పెట్టింది. అనేక సంవత్సరాలు టీవీల్లో నటించక బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. “సూపర్ 30″సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకొంది. ఆ సినిమా విడుదలైన రెండేళ్లకు తెలుగులో “సీతారామం” సినిమాలో ఛాన్స్ దక్కడం, ఆ తర్వాత ఆమె కెరీర్ ఊపందుకోవడం జరిగింది.
తెలుగులో నటించాకే ఆమెకి సంపాదన పెరిగింది. అందుకే మరింతగా కూడబెట్టుకునేందుకు ఈ భామ పెళ్లి పక్కన పెట్టి కెరీర్ గురించి ఆలోచిస్తోంది. ఐతే ఈ రోజుల్లో పిల్లలను కని కూడా హీరోయిన్ గా మంచి పొజిషన్ లో కొనసాగుతున్న వారున్నారు. అలియా భట్, నయనతార వంటి వారు ఉదాహరణ. మరి ఈ భామ అలా ఎందుకో ఆలోచిస్తుందో మరి.
సరైనోడు కావాలి… రావాలి
జీవితంలోకి సరైనోడు వచ్చేంతవరకు పెళ్లి గురించి ఆలోచించదట. సరైనోడు అంటే ఆమె దృష్టిలో తన కెరీర్ గురించి, నటిగా ఉండే ఒత్తిడి, డిమాండ్స్ అర్థం చేసుకునేవాడంట.