
‘కల్కి-2’ మరోసారి వార్తల్లోకెక్కింది. స్వయంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాపై స్పందించాడు. సూపర్ హిట్టయిన ‘కల్కి’ సినిమాకు సీక్వెల్ గా ‘కల్కి-2’ రాబోతున్న సంగతి తెలిసిందే.
పార్ట్-2కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తిచేసినట్టు ప్రకటించాడు దర్శకుడు. ఈ ఏడాదిలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి, వచ్చే ఏడాది చివరి నాటికి థియేటర్లలో రిలీజ్ చేస్తామని అన్నాడు. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లయ్ అంటున్నాడు.
ఈ సినిమా పూర్తిచేయాలంటే ప్రభాస్ కాల్షీట్లు కావాలి. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే ‘స్పిరిట్’ సెట్స్ పైకి రాబోతోంది. అటుఇటుగా ‘సలార్-2’ కూడా రాబోతోంది.
వీటి మధ్య ‘కల్కి-2’కు చోటు దక్కుతుందా అనేది నాగ్ అశ్విన్ అనుమానం. అటు దీపిక పదుకోన్ కూడా షూటింగ్ కు సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్ కూడా రెడీ. ఎటొచ్చి ప్రభాస్ కాల్షీట్లు కావాలి, పైపెచ్చు కమల్ హాసన్ కాల్షీట్లు కూడా ఇప్పుడు కీలకమే. ఎందుకంటే, రెండో భాగం మొత్తం ప్రభాస్-కమల్ పైనే నడవబోతోంది.