కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ సినిమా దీపావళి విన్నర్ గా అవతరించింది.
మరో 3 సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, వాటి కంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అయి హిట్ అనిపించుకుంది. విడుదలైన 4 రోజులకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శించడం కలిసొచ్చింది. అలా ‘క’ సినిమా ఏకథాటిగా 3 రోజుల పాటు హౌజ్ ఫుల్స్ తో నడిచింది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ సాధ్యమైంది.
ALSO READ: ‘Ka’ breaks even and sets for profits
విడుదలకు ముందు 80కి పైగా వేసిన పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్స్ తో కలిపి ఈ ఘనత సాధించింది ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకు సుజీత్-సందీప్ దర్శకత్వం వహించారు. నయన్ సారిక హీరోయిన్ గా చేసింది.