హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అది వాళ్లకు అవసరం. అయితే ఎంత యాక్టివ్ గా ఉంటారో, అంతే సడెన్ గా సోషల్ మీడియా నుంచి తప్పుకుంటారు కూడా. ఆమధ్య హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరమైంది. ఇప్పుడు చాందినీ చౌదరి (Chandini Chowdary) వంతు వచ్చింది.
ఈ ముద్దుగుమ్మకు కొన్నాళ్ల కిందట పెద్ద గాయమైందంట. అయితే దాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అలానే సినిమాలు కొనసాగించింది. అది కాస్తా ఇప్పుడు తిరగబెట్టింది. మరింత సీరియస్ అయింది.
దీంతో ఆమె బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరమౌతున్నట్టు చాందినీ చౌదరి తెలిపింది.
బాలకృష్ణ-బాబి సినిమా (NBK109)లో నటిస్తోంది చాందినీ చౌదరి. అందులో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. గాయంతోనే ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంది. తాజాగా తన పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తిచేసింది.