హీరోయిన్ అమలాపాల్, జగత్ దేశాయ్ ను పెళ్లాడి ఏడాది అయింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తన మాజీ భర్తను, గత జ్ఞాపకాల్ని ఆమె గుర్తుచేసుకోవడం విశేషం.
“ఎన్నో కలలు సాకారం చేసుకోవాలనుకున్నాను. కానీ జీవన ప్రయాణంలో కొన్నింటిని కోల్పోయాను. అయితే నా జీవితంలో నాకు నచ్చని విధంగా జరిగిన ప్రతిదానికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే, ఆ చేదు అనుభవాల వల్లనే నాకు జగత్ దేశాయ్ లాంటి మంచి మనిషి దొరికాడు. అతడు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకో సురక్షితమైన ఇల్లు దొరికినట్టు అనిపించింది.”
ఇకపై తను ఒంటరిని కాదని.. జగత్ ను చూసుకుంటే అద్దంలో తననుతాను చూసుకుంటున్నట్టు ఉంటుందని అంటోంది అమలా పాల్. జీవితంలో ఇప్పుడు తనున్న బెస్ట్ పార్ట్ కు పాత చేదు అనుభవాలే కారణమంటోంది.
ఇలా పరోక్షంగా అమలాపాల్ తన గత జీవితం, తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ ను గుర్తు చేసుకుంది.
2014 లో అమలాపాల్, విజయ్ పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అలా కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. ఏడాది తిరక్కముందే బిడ్డకు జన్మనిచ్చింది.