
జాన్వి కపూర్.. మనసు పొరల్లో అంతులేని భక్తిభావం పొంగిపొర్లుతోందంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఎవరైనా నమ్మి తీరాల్సిందే.
తిరుమల శ్రీవారిపై తనకున్న అచంచలమైన భక్తిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది జాన్వి కపూర్. మినిమం గ్యాప్స్ లో ఎప్పటికప్పుడు తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంది. అంతేకాదు, తను పెళ్లంటూ చేసుకుంటే తిరుమలలోనే చేసుకుంటానని కూడా ఆమె ఇదివరకే ప్రకటించింది.
ఇప్పుడు తిరుమలపై తన ప్రేమను మరోసారి బయటపెట్టింది. ఈసారి ఇంకాస్త లోతుగా మాట్లాడింది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి తిరుపతిలోనే కాపురం పెట్టాలనే కోరికను జాన్వి కపూర్ బయటపెట్టింది.
అంతేకాదు.. ‘గోవిందా..గోవిందా’ అంటూ జపిస్తూ.. రోజూ అరిటాకుల్లో భోజనం చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చింది. తిరుపతిలోని ప్రశాంతమైన వాతావరణంలో మణిరత్నం సినిమాల్లోని పాటలు వింటూ కాలం గడపాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. జాన్వి కపూర్ కు భక్తితో పాటు, మంచి టేస్ట్ కూడా ఉందంటున్నారు నెటిజెన్లు.