
సమంత సినిమాలకు దూరమైంది. అదే టైమ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఊహించని పాత్రల్లో కనిపిస్తోంది. దీనిపై ఆమె ఫన్నీగా స్పందించింది. ఈ విషయంలో దర్శకులు రాజ్& డీకే తనను మార్చేశారని అంటోంది.
“ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 చేశాను. అంతకుముందెప్పుడూ అలాంటి రోల్ చేయలేదు. మళ్లీ సిటాడెల్ చేశాను. అది కూడా అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. పూర్తి యాక్షన్ రోల్ అది. ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ కూడా అటువంటిదే. ఇలా మంచి పాత్రలతో, నన్ను నేను ఎప్పటికప్పుడు సవాల్ చేసుకునేలా రాజ్& డీకే నన్ను మార్చారు. నేను ప్రతిరోజూ సెట్స్ పైకి వెళ్లినప్పుడు, ఒక పాత్రకు అంత ఎక్కువ ఎలా ఇవ్వగలను అని ఆలోచిస్తున్నాను. దానికి కారణం రాజ్ & డీకే. వాళ్లు నన్ను అంతలా చెడగొట్టేశారు.”
ఇక తమిళ సినిమాలపై కూడా స్పందించింది. చివరిసారిగా విజయ్ సేతుపతి సినిమాలో నటించిన సమంత.. 37 ఏళ్ల ఈ వయసులో తను చేయబోయే ప్రతి సినిమాను చివరి చిత్రంగా భావిస్తున్నానని, వందశాతం నమ్మకం లేకపోతే సినిమాలు అంగీకరించడం లేదని తెలిపింది.
అలా వందశాతం నమ్మకం కలిగించే ప్రాజెక్టు తగిలినప్పుడు తప్పకుండా కోలీవుడ్ లో సినిమా చేస్తానంటోంది సమంత. ఏదో ఒక సినిమా చేసి తమిళ అభిమానుల్ని నిరాశపరచడం తనకు ఇష్టంలేదంటోంది.