
ఇటీవల భారీగా హిట్ అనిపించుకున్న “పుష్ప2” వంటి సినిమాలకు కూడా వచ్చిన కలెక్షన్లకు మించి చాలా అదనంగా కలిపి పోస్టర్లను విడుదల చేశారు. అలాగే దారుణంగా పరాజయం పాలు అయిన “గేమ్ చేంజర్” సినిమాకి వందల కోట్ల వసూళ్లు అంటూ పోస్టర్లు విడుదల చెయ్యడం మరీ విడ్డూరంగా అనిపించింది. ఆఖరికి మంచి విజయం సాధించిన “సంక్రాంతికి వస్తున్నాం”, అలాగే మోస్తరుగా ఆడిన “డాకు మహారాజ్”కి కూడా వచ్చిన దానికి మించి ఎక్కువ వసూళ్లు కలిపి భారీ పోస్టర్లు రిలీజ్ చేశారు.
ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్ల వల్ల అభిమానులు, హీరోల ఇగో సంతృప్తి అవుతుంది కానీ అవి నిజమేమో అనుకోని ఐటీ దాడులు జరిగి నిర్మాతల కొంపలు ముంచుతున్నాయి. ఇదే విషయాన్ని అడిగితే సీనియర్ నిర్మాత దిల్ రాజు ఈ ట్రెండ్ ఖచ్చితంగా తప్పే అని అంగీకరించారు. “వచ్చిన దానికి మించి వసూళ్లు చెప్పడం తప్పే,” అన్నారు.
ఆయన ఇళ్లపై, ఆఫీసులపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Dil Raju
– నాలుగు రోజులు పాటు మా నివాసాల్లోనూ, ఆఫీస్ లోనూ ఐటి అధికారులు సోదాలు జరిపారు.
– ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారు… మా ఆడిటర్స్ వెళ్లి కలుస్తారు.
– పెద్ద మొత్తం డబ్బు దొరికింది అని ఛానెల్స్ లో వచ్చిన వార్తల్లో నిజం లేదు. మా దగ్గర 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయి. వాటికీ లెక్కాపత్రాలు ఉన్నాయి.
– ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు..
– నావద్ద డాక్యమెంట్స్ చెక్ చేశారు. ఐటీ డిపార్ట్మెంట్ వారు ఆశ్చర్య పోయారు.. అంతా క్లీన్ గా ఉందన్నారు.
– నేనేమి టార్గెట్ అవ్వలేదు.. మా మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయింది.ఇదంతా ప్రాసెస్ …. ఎక్కువగా ఊహించుకొవద్దు… ఎలాంటి హాడావుడి లేదు.
– ఇండస్ట్రీ లో అంతా ఆన్ లైన్ లో బుకింగ్ … ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి.
– కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాలి. అది తప్పు… తీరు మార్చుకొవాల్సిందే…