‘శ్వాగ్’ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు శ్రీవిష్ణు. దాదాపు అన్ని పాత్రలు అతడే పోషించగా, అందులో కీలకమైన రెండు పాత్రల కోసం రీతూ వర్మ, దక్ష నగార్కర్ ను హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీకి కూడా ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నాడు ఈ హీరో.
కార్తీక్ దర్శకత్వంలో ఎప్పట్లానే సైలెంట్ గా ఓ సినిమా పూర్తి చేస్తున్నాడు శ్రీవిష్ణు. గతంలో ‘నిను వీడని నీడను నేను’ అనే చిత్రంతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు శ్రీవిష్ణుతో మరో డిఫరెంట్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ఇవానా, కేతిక శర్మను తీసుకున్నారు.
కెరీర్ లో ఛాన్సుల్లేక ఇబ్బంది పడుతున్న కేతిక శర్మకు ఇది నిజంగా మంచి అవకాశంగానే చెప్పాలి. ఇక ఇవానా అయితే ‘లవ్ టుడే’ సక్సెస్ తర్వాత తెలుగులో నిర్మాత శిరీష్ కొడుకు ఆశిష్ సరసన ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ “సెల్ఫీస్” అనే సినిమా దాదాపుగా ఆగిపోయింది. అది విడుదల అవుతుందో లేదో కూడా తెలియదు. సో, శ్రీవిష్ణుతో మూవీ ఆమెకి మొదటి తెలుగు సినిమా అయ్యేలా ఉంది.
అలా ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి సినిమాను పూర్తి చేస్తున్నాడు శ్రీవిష్ణు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు అల్లు అరవింద్ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.