హీరోయిన్ తమన్నా భాటియా టీనేజ్ లోనే నటించడం మొదలు పెట్టింది. 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్ గా నటిస్తోంది. 18 ఏళ్ళ కెరీర్ పూర్తి అయింది. మరి బోర్ కొట్టడం లేదా? నటనకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు పెళ్లి వరకు ఆగాలి అని భావిస్తోందా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది తమన్న.
“నాకు నటన అంటే ఇష్టం. సినిమా షూటింగ్ కి వస్తేనే ఎనర్జీ వస్తుంది. పని లేకపోతే తోచదు. నటనకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచన ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. రాదు కూడా. పెళ్లి గురించి ఇప్పుడు ఏమి అడగొద్దు కానీ పెళ్ళికి, కెరీర్ కి సంబంధం లేదు. పెళ్లి చేసుకున్నా నటిస్తాను,” అనే క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అనేది టాక్.
మరోవైపు, తమన్న ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ సినిమాలో నటిస్తోంది.