పూజ హెగ్డే హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్న టైంలోనే బాగా సంపాదించింది. అలాగే సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టుకొంది. హీరోయిన్ గా అత్యధిక పారితోషికం అందుకోవడంతో పాటు బ్రాండ్లు, యాడ్లు, ఇన్ స్టాగ్రామ్ ప్రమోషన్లు, షాప్ ఓపెనింగులు… ఇలా సినీమేతర ఆదాయం కూడ ఆమెకి ఎక్కువే వచ్చింది.
అందుకే హీరోయిన్ గా తక్కువ కాలంలోనే దాదాపు 100 కోట్లు సంపాదించినట్లు ఒక అంచనా. అందుకే ఆ మధ్య ఆమె కోట్లు పెట్టి నాలుగు వేల చదరపు అడుగుల ఫ్లాట్ కొనుక్కొంది. ముంబైలో ధనవంతుల ప్రాంతంగా పేరొందిన బాంద్రాలో సముద్ర ముఖం ఉండే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కొంది. దాని ఖరీదు అక్షరాలా 45 కోట్ల రూపాయలు.
ఆ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ పనులు అన్ని పూర్తి కావడంతో ఆమె ఇప్పుడు ఆ ఇంట్లోకి మూవ్ కానుందట.
రెండేళ్ల క్రితం వరకు తెలుగులో పూజ హెగ్డే నెంబర్ వన్ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో ఒక్క ఆఫర్ లేదు. కానీ ఒకటి రెండు సినిమాలల్లో మాత్రం ఆమె పేరుని పరిశీలిస్తున్నారు. మరోవైపు, హిందీలో మాత్రం ఆమెకి ఇప్పటికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
సంపాదనలో తగ్గేదే లే
33 ఏళ్ల ఈ భామ కన్నడ, మలయాళ భాషల్లో కూడా అవకాశాల కోసం చేస్తోంది. కెరీర్ ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఆమె తన పారితోషికాన్ని తగ్గిస్తే ఇప్పటికీ తెలుగులో ఎక్కువ ఛాన్సులు వస్తాయి. కానీ ఆ విషయంలో తగ్గేదే లే అంటోంది. పారితోషికం విషయంలో ఆమె బెట్టు చేస్తోంది.