హీరో ప్రభాస్ చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ లా హెయిర్ స్టైల్ కోసం, కమల్ హాసన్ లా యాక్ట్ చేసేందుకు ప్రయత్నించే వాడట. ఈ విషయన్ని ప్రభాస్ తాజాగా బయట పెట్టారు. ముంబైలో ఈ రోజు (జూన్ 19న)”కల్కి 2898 AD” ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ ప్రభాస్ మాట్లాడారు.
“గొప్ప నటులతో నటించే అవకాశం కల్పించిన నిర్మాత అశ్వనీ దత్ గారికి, నాగ్ అశ్విన్ కి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నా. అమితాబ్, కమల్ హాసన్ గార్లతో నటించడం ఎప్పటికీ మరవలేని అనుభూతి. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం.” అని అన్నారు ప్రభాస్.
“అమితాబ్ గారు కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి కడుపులో క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్.”
“కల్కి 2898 AD” సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్తామ పాత్రలో నటించారు. కమల్ హాసన్ విలన్ గా నటించారు.