“కల్కి 2898 AD” దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో వీడియోలో సినిమాకి సంబంధించిన విషయాలను బయటపడుతున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ కథ. దాంతో పాటు మన మహాభారతం, విష్ణువు అవతారాల సంగతి ఉంటుంది. ఇది పూర్తిగా ఊహాజనిత కథే. అందుకే జనాలకు ముందే సినిమా కథ గురించి తెలిసేలా ఒక్కో మేటర్ ని విప్పుతున్నాడు.
మనం “ముల్లోకాల’ గురించి, త్రిశంకు స్వర్గం గురించి విన్నాం, చదివాం. అలాంటి కాన్సెప్ట్ ని ఈ సినిమాలో నాగ్ అశ్విన్ చూపిస్తున్నాడు.
“కథ మూడు ప్రాంతాల్లో జరుగుతుంది. కాశీ నగరం, కాశీపైన పిరమిడ్ ఆకారంలో ఒక ప్రాంతం. దాన్ని ఈ కథలో కాంప్లెక్స్ అంటాం. భూమిపై లేని వన్నీ అక్కడ ఉంటాయి. ఒకరమైన స్వర్గం అనుకోవచ్చు. త్రిశంకు స్వర్గం అన్నమాట. మూడో వరల్డ్ కూడా వుంది. అదే శంబాల,” అని చెప్పారు నాగ్ అశ్విన్.
శంబాలాలో దేవుడు అనే భావన ఉండదు. కల్కి అవతారం శంబాలాలో పుడుతుందనే నమ్మకం మన పాపులర్ కల్చర్ లో ఉంది. అలా మూడు లోకాల చుట్టూ ‘కల్కి’ కథ నడుస్తుంది,” అన్నారు నాగ్ అశ్విన్.
‘కల్కి 2898 AD’ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు.