విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కావాలా? ఇప్పుడా అవకాశం అందుబాటులోకి వచ్చింది. మీకు టాలెంట్ ఉండి, కాస్త అదృష్టం కూడా ఉంటే, విజయ్ దేవరకొండ సినిమాలో నటించొచ్చు. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు.
రవికిరణ్ కోలా దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు విజయ్ దేవరకొండ. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ డ్రామా ఇది. ఇందులో నటించడానికి నటీనటులు కావాలంటూ దిల్ రాజు పిలుపునిచ్చాడు. అన్ని వయసులవాళ్లు అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటించాడు.
“యాక్టింగ్ వస్తే చాలు, తెలుగొస్తే సంతోషం, గోదావి యాస వస్తే ఇంక ఆపేవాడే లేడు.” అనే క్యాప్షన్ తో కాస్టింగ్ కాల్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ తో రాబోతోందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా కొలిక్కి వచ్చిన వెంటనే రవికిరణ్ కోలా సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ హీరో తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి అమెరికా టూర్ లో ఉన్నాడు.
CASTING CALL
— Telugucinema.com (@telugucinemacom) June 19, 2024
Put yourself on the Big Screen & The Bigger World of #SVC59
Share your profiles on [email protected]
(or)🗨️ WhatsApp on +91 9676843362 pic.twitter.com/sguHGJJcBP