మృణాల్ ఠాకూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పింది. అందులో కిస్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల గురించి కూడా మాట్లాడింది.
“మొదట్లో తాను బాలీవుడ్ లో ఒద్దికగా కనిపించే దాన్ని. పద్దతి అయిన పాత్రలు చేసేదాన్ని. కానీ కొన్నాళ్ళకు అర్థమైంది నా కెరీర్ లో ఎదుగు బొదుగూ లేకపోవడానికి కారణం నేను పాత్రల విషయంలో చెప్తున్న నియమాలే అని. కిస్ సీన్లకు, ఓవర్ గా ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండడంతో చాలా మంచి మంచి సినిమాలు పోయాయి,” అని మృణాల్ చెప్పింది.
దాంతో ఈ అమ్మడు తన పంథా మార్చుకుంది. తన తల్లితండ్రులను కూర్చుండబెట్టి వాళ్లకు చెప్పిందట.
“ఈ రోజుల్లో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు కథలకు, సినిమాలకు ఎంత అవసరమో తెలిపిందట. అది కేవలం నటనగానే చూడాలి. అందులో తప్పు లేదు అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అలా మెల్లగా అవకాశాలు వచ్చాయి,” అని తెలిపింది.
మడి కట్టుకొని కూర్చుంటే …. నేటి కాలానికి తగ్గట్లు ఉండకపోతే… మంచి ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చేది. అందుకే తాను మారిపోయాను అని చెప్పింది. అలా ఇప్పుడు ఈ భామ ముద్దు సీన్లు, మంచి హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ లు చేస్తోంది.