ఇటీవల శ్రీలీల హవా తగ్గింది. “గుంటూరు కారం” విడుదలయ్యాక ఆమె సైలెంట్ అయిపొయింది. కొత్త సినిమా ప్రకటనలు కూడా రాలేదు. ఐతే, ఆమెపై రూమర్లు మాత్రం ఆగలేదు.
తాజాగా ఆమె ఒక పెద్ద సినిమా ఆఫర్ ని తిప్పి కొట్టింది అనే ప్రచారం జరిగింది. అదీ కూడా తమిళంలో అగ్ర హీరోగా కొనసాగుతున్న విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చెయ్యమని అడిగితే నో చెప్పింది అనే వార్త బయటికి వచ్చింది. దాంతో, విజయ్ ఫ్యాన్స్ ఆమెని ట్రోల్ చేశారు. వరుసగా సినిమా ఫ్లాపులు అవుతున్న టైంలో మా హీరో సినిమా ఆఫర్ వస్తే కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి కానీ రిజెక్ట్ చేస్తావా? ఎందుకంత అహంకారం? అంటూ విజయ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
నిజం ఏంటంటే ఆమెని విజయ్ తో సినిమా తీస్తున్న దర్శకుడు వెంకట్ ప్రభు కానీ, నిర్మాతలు కానీ అప్రోచ్ అవ్వలేదంట. ఆమెని స్పెషల్ సాంగ్ చెయ్యమని అడగలేదు. ఈమె తిరస్కరించలేదు. ఇది నిజం అని శ్రీలీల టీం చెప్తోంది.
మరి ఈ అమ్మడు ఎందుకు ఈ రూమర్లపై అఫీషయల్ గా స్పందించలేదు అని అడిగితే ఇలాంటి ప్రచారానికి రెస్పాండ్ అయితే ఇకపై వచ్చి ప్రతి వార్తకు, రూమర్లకు, అన్నింటికి అవ్వాల్సి ఉంటుంది అని శ్రీలీల అంటోందట. అందుకని ఆమె ఈ రూమర్లను పట్టించుకోకుండా లైట్ తీసుకొంది.