హనీ రోజ్ పేరు చెప్పగానే నిండైన సౌష్ఠవంతో కూడిన రూపం గుర్తొస్తుంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ నిండా తన ఒంపుసొంపులు కనిపించే ఫొటోలే పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆమెకి గ్లామర్ తారగా గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు తన ఇమేజ్ కి భిన్నమైన చిత్రంలో, పాత్రలో దర్శనం ఇవ్వనుంది.
హనీ రోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘చిత్రం.. రేచెల్’. ఈ మూవీ టీజర్ విడుదలైంది. మొత్తం హింస, రక్తపాతం తెరనిండా ఉంటాయని టీజర్ హిట్ ఇస్తోంది. ఆనందిని బాలా దర్శకత్వం వహించారు ఈ మూవీ. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గులాబీ బాలగా కవ్వించాల్సిన హానీ రోజ్ ఇలా రక్తపాతం సృష్టించేందుకు సిద్ధమైంది.
కేరళకి చెందిన ఈ మలయాళీ భామ తెలుగులో బాలయ్య సరసన “వీర సింహా రెడ్డి” చిత్రంలో నటించింది. అలాగే “ఈ వర్షం సాక్షిగా” అనే చిత్రంలో కూడా కనిపించింది. ఐతే ఆమెకి తెలుగులో గుర్తింపు వచ్చింది మాత్రం బాలయ్య మూవీతోనే.
ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామకి 4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు మరి.