బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. కొత్తగా పెళ్లయిన తన సోదరుడికి ఆమె అదిరిపోయే బహుమతి ఇచ్చింది. తన కజిన్ కు చండీగడ్ లో ఖరీదైన లగ్జరీ ఇంటిని కొని ఇచ్చింది కంగన.
తన సోదరుడికి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని కంగనా రనౌత్, సోషల్ మీడియాలో వెల్లడించింది.
“గురునానక్ దేవ్ జీ మన దగ్గర ఉన్న చిన్నదైనా పంచుకోవాలని చెప్పారు. మనకు ఏమీ లేదని నిత్యం బాధపడుతుంటాం. కానీ మనం పంచుకోవాలనుకుంటే… ఎంత చిన్నదైనా అదే పెద్ద ఆనందమని నేను భావిస్తాను,” అంటూ సోదరుడిపై పోస్ట్ పెట్టింది కంగనా.
తను పెద్ద బహుమతి ఇచ్చినప్పటికీ, దాన్ని చిన్నదిగానే చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్.
ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందింది కంగనా రనౌత్. త్వరలోనే ఆమె “ఎమర్జన్సీ” అనే సినిమాను విడుదల చేయబోతోంది. ఇందులో ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ చిత్రానికి డైరక్టర్ కూడా కంగనానే.