Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

భారతీయుడు 2… అవన్నీ పుకార్లే!

Cinema Desk, June 17, 2024June 17, 2024
Bharateeyudu 2

“భారతీయుడు-2” సినిమాపై మరోసారి పుకార్లు ముసురుకున్నాయి. ఈ సినిమా చెప్పిన తేదీకి రావడం లేదనేది చాలా మంది అభిప్రాయం. ఇప్పటికే ఓసారి వాయిదా పడిన “భారతీయుడు-2” సినిమాను జులై 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రావడం లేదని, ఆగస్ట్ 15కి వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది.

ఆగస్టు 15న విడుదల కావాల్సిన “పుష్ప 2” వాయిదా పడిన నేపథ్యంలో తమ సినిమా కథకు అనుగుణంగా ఆ డేట్ ని విడుదల చేస్తే బాగుంటుంది అని టీం అనుకుందట. అలా వార్తలు వచ్చాయి.

ఈ ప్రచారాన్ని యూనిట్ తప్పు పట్టింది. మల్టీప్లెక్సులతో ఒప్పందం కుదిరిన సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతలు, అదే టైమ్ లో విడుదల తేదీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కమల్ హాసన్ సేనాపతిగా నటించిన ఈ సినిమా, చెప్పిన తేదీకే వస్తుందని పరోక్షంగా పుకార్లకు స్టాప్ వేశారు.

శంకర్, కమల్ కాంబినేషన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు-2. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు దాటుకొని విడుదలకు సిద్ధమైంది. అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలకు పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ, సినిమాపై బజ్ మాత్రం తగ్గలేదు.

Bharateeydu 2

సిద్దార్థ్, రకుల్, కాజల్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను తమిళ్ లో ఇండియన్-2గా, తెలుగులో భారతీయుడు-2గా విడుదల చేస్తున్నారు.

న్యూస్ Bharateeyudu 2Bharateeyudu 2 Release DateIndian 2భారతీయుడు 2భారతీయుడు 2 రిలీజ్ డేట్భారతీయుడు 2 విడుదల తేదీ

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Chiranjeevi
    చిరంజీవి పేరే సినిమాకి టైటిల్!
  • Oh Bhama Ayyo Rama
    సుహాస్ ‘హవా’ అయిపోయినట్లే
  • Sanjay Dutt
    నాగార్జున ఫ్రెండ్, చిరు ఇష్టం: దత్
  • Hari Hara Veera Mallu
    కుదిరితే ఇక్కడ, లేకపోతే అక్కడ
  • Shilpa Shetty
    జనానికి ఏది కావాలో అదే చేస్తుందట
  • Samantha
    నేను దానికి బానిసయ్యాను: సమంత
  • Shruti Haasan
    శృతిహాసన్ ఇక కనిపించదు
  • Srikanth
    డ్రగ్స్ కేసులో హీరోకు బెయిల్
  • Kiara Advani
    ఈ సినిమాలో కియరా ఉందంట
  • Venkatesh, Balakrishna, Chiranjeevi
    బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!
  • Anupama Parameswaran
    అందుకే అనుపమకి కష్టాలు!
  • Top Movies
    2025: మలి సగం మెరవాల్సిందే!
  • AR Rahman
    సూర్య సినిమాకు రెహ్మాన్
  • Nithiin
    దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!
  • Kannappa
    అప్పుడు అలా… ఇప్పుడిలా!

ఇతర న్యూస్

  • చిరంజీవి పేరే సినిమాకి టైటిల్!
  • సుహాస్ ‘హవా’ అయిపోయినట్లే
  • నాగార్జున ఫ్రెండ్, చిరు ఇష్టం: దత్
  • కుదిరితే ఇక్కడ, లేకపోతే అక్కడ
  • జనానికి ఏది కావాలో అదే చేస్తుందట
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us